అయ్యా!
నేను ఇంతగా ప్రాధేయ పడి అడుగు తున్నాను అంటే నేను ఎంతగా చేయని తప్పుకు ఆర్ధికంగా ఇంకా నా ఉద్యోగ
భవిష్యత్తు పరంగా కూడా తేరుకోలేనంతగా చితికి పియానో కాస్త ఆలోచించండి, నేను ఏ తప్పు చేయలేదు కనుక
మీకు అంత ధైర్యంగా నష్ట పరిహారం గురించి అడగ గలుగు తున్నాను. అంతే గాని నాకు మీమీద ఎటువంటి
దురుద్దేశము లేదు. అసలు నా తప్పు లేకుండానే నన్ను నిర్ధాక్షిణ్యంగా పాఠశాల నుండి పంపించేశారు నేను ఆ
క్షణాన తెలుసుకోలేకపోయాను. నన్నెందుకు మీ సంస్థ లో నియమించారు 4 నెలల కోసం? మీ ఇష్టప్రకారం
నియమించారు, తప్పొప్పుల విచక్షణ లేకుండా తొలగించారు, నన్ను నియమించిన రోజు ఎందుకు ఆలోచించ
లేదు నాకు ఎక్కువ జీతం ఇస్తున్నట్టు. నేను మీ సంస్థ కన్నా ఎన్నో రేట్లు ఎక్కువ ఉన్న సంస్థ లో న ప్రేమేయంగా
నేను బయటికి వచ్చినందుకు మీరు నాకు చాల కొద్దిరోజులలో మంచి బహుమానం ఇచ్చి ఇంటికి పంపించేశారు.
నేనైమైపోవాలి నా కుటుంబ మేమైపోవాలి. మీ సంస్థ లాభార్జన ధ్యేయము లేకుండా ఇంకా విద్యార్థులకు విధ్యా బుద్ధులు
నేర్పే పాఠశాల. అటువంటి సంస్థ లో నాకు అన్యాయంగా చాలా అన్యాయం జరిగింది. ఇంకా నా భవిష్య నిధి పరిష్కారం
కూడా సవ్యంగా జరగలేదు. మీరు నాకు నష్టపరిహారం దయతో మంజూరు చేస్తే కనక నేను కొంతలో కొంత
తేరుకో గలను. మీరు సమాజం లో చాలాపేరు ప్రఖ్యాతలు ఉన్న పెద్ద వ్యక్తి. నా యందు దయతో వ్యవహరిస్తారని
ఆసిస్తూ ఈ దీనుడు మోర పెట్టుకుని అడుగుతున్నాడు. ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు కానీ నేను చేయని తప్పుకు
బలి ఐపోయాను. మీరు సముద్రం లాంటి వారు నేను ఆ సముద్రం లో ఒక నీటి బొట్టు కూడా కాను కాలేను,
మీ సముద్రం లాంటి మనసుతో ఒక నీటి బొట్టు లాంటి దయ చూపించమని ప్రాధేయ పడుతున్నాను.
నా నష్టపరిహారం గురుంచి ఒకసారి ఆలోచిస్తారని ఆసిస్తూ ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబానికి ఆ దేవుడు చల్లగా
చూడాలని కోరుకుంటూ ఎల్ల వేళల మీ మంచికోరే మీ మాజీ ఉద్యోగి.
Yours sincerely,
P. Chandankumar
Mobile: +91-[protected]
Hyderabad
Was this information helpful?
Post your Comment