ఏలూరు జిల్లా, ఏలూరు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వారికి తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు మండలం, కుమరదేవం గ్రామ కాపురస్తులు పెద్దింటి మారుతి శివ రామ కృష్ణ కిషోర్ గారి భార్య శ్రీమతి పెద్దింటి తులసి అనే పెద్దింటి తులసి శ్యామల కుమారి చేసికొనుచున్న విన్నపం
అయ్యా!
నా పేరు పెద్దింటి తులసి.నాకు ఏలూరు జిల్లా, కైకలూరు మండలము, సింగా పురం గ్రామం లో సర్వ్వే నంబర్ 9-3 లో పూరా 92 సెంట్లు భూమి కలదు. భూమి నాకు నా తల్లిగారైన అగ్నిహోత్రం సత్యవతమ్మా వలన దఖలు దస్తావేజు DOC No 2678/2019 వలన నాకు సంక్రమించింది.సదరు ఆస్తి నా పేరున రెవెన్యూ రికార్డు లో నమోదు అయి ఉన్నది
ప్రస్తుతం ప్రభుత్వము వారిచే చేపట్టిన సమగ్ర భూ సర్వే లో భాగంగా చేసిన సర్వే లో నా భూమి కొలత 89 సెంట్లు వచ్చినట్టుగా వారు notice ఇచ్చి ఉన్నారు. కానీ నా భూమి పూరా 92 సెంట్లు అయి ఉన్నది.ఆ నంబర్లో ఇతరులేవరికిని భూమి లేదు.
కావున దయచేసి రెవెన్యూ రికార్డ్ ప్రకారం సరైన సర్వే మరల చేసి నాకు 92సెంట్లు భూమిని అప్పచెప్పవలిసినదిగా ఏలినవారిని కోరి ప్రార్థించు చున్నాను.
Was this information helpful? |
Post your Comment