Address: | RTC Depot Mancherial, 504201 |
మంగళవారం హైదరాబాదు నుండి చెన్నూరుకి రాత్రి 10:30 గం, లకి బయలుదేరే గరుడ బస్స్సులో ఏసీ పనిచేయలేదు, డ్రైవరు శతవిధాలా ప్రయత్నించి బస్సుని కన్సల్ చేయడానికి ప్రయత్నించి పై అధికారుల సమ్మతి దొరక్క ఏసీ లేకుండానే దాదాపు గంట లేటుగా బస్సుని హైదరాబాదు నించి కదిలించారు, జేబీఎస్ చేరేలోపు పలువురు ఊపిరాడక వాంతిచేసుకున్నారు మరియు గాలికోసమై డ్రైవరు కాబిన్ లో వచ్చి కూర్చున్నారు మరియు మంచిర్యాల డిఎం గారిని ఫోనులో సంప్రదించి ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉందని ప్రత్యామ్నాయంగా ఏమైనా చేయాలని విన్నవించుకోవడం జరిగింది అయిననూ ఎటువంటి సహాయం ప్రయాణీకులకు అందక పిల్లలు మహిళలు అవస్థలు పడుతూ ప్రయాణాన్ని కొనసాగించారు, ఏసీ బస్సులో అదనపు చార్జీలు వసూలు చేసే మన ఆర్టీసీ అవసరమైనపుడు అదనపు సర్వీసులు ప్రయాణీకులకు అందించాలని విస్మరించింది. ఆతరువాత ఉక్కిరి బిక్కిరి అయినా ప్రయాణీకులు కనీసం కరీంనగర్ నుంచి అయినా సర్వీస్ మార్చడం కోసం విన్నవించుకోవడానికి డియం గారికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ తీయకుండా ఒక హోదాలో ఉండికూడా ప్రయాణీకులని గాలిలేకుండా వొదిలేశారు, ఇలాంటి పరిస్థితిలో ఎవరికైనా ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు, కనీసం ప్రయాణీకులు ఇంత ఇబ్బందితో వారి ప్రయాణాన్ని కొనసాగించినందుకు అదనపు చార్జీలని తిరిగి చెల్లించాలని మరియు చెన్నూరుకి ముందునించి చిన్నచూపు చూసే అలసత్వం పోయి మంచి సర్వీసులని అందించి ప్రయాణికుల మన్ననలు పొందాలని కోరుకున్నారు. ఇట్టి అవస్థని స్థానిక MLA గారికి మరియు RM, DM లకి ఇమెయిల్ ద్వారా మరియు ట్రాన్స్ పోర్ట్ మినిష్టర్ గారికి టీఎస్ ఆర్టీసీ హెడ్ ఆఫీసుకి ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. Was this information helpful? |
Post your Comment