Revenue Workers — cheering formers in sri city area
T
Trk18
from Srikakulam, Andhra Pradesh
Jul 17, 2017
Address: Chittoor, Andhra Pradesh, 517541
Website: www.eenadu.net
సర్ మేము చిత్తూర్ జిల్లా వరదయ్య పాలెం మండలం రాచర్ల గ్రామ వాసులము వ్రాయునది ఏమనగా, మాకు శ్రీ సిటీ ఏరియా లో 1994 సంవత్సరం దాదాపు 23 సంవత్సరాల క్రితం పట్టాలు ఇచ్చినారు. అప్పటి నుంచి మా సాగు లో ఉన్నాయి. కాని ఈ మధ్య కొంత కాలం క్రితం కొంత మంది రాజకీయ నాయకులు బడా నాయకులు పార్టీలకు అతీతముగా మాకు ఇచ్చిన పట్టాలను వేరొకరికి పట్టా చేయించారు. ఒకే భూమిని ఇద్దరికి ముగ్గురుకి నలుగురికి కూడా ఇప్పించారు. అప్పటి mro మరియు vro కలిసి అమాయక ప్రజల దగ్గర డబ్బులు దండుకొని వాళ్ళ ఇష్టం వచ్చి నట్లు పట్టాలు ఇచ్చారు. కానీ రీసెంట్గా sri city లో ల్యాండ్స్ కొనే ట పు డు మొదట పట్టా ఇచ్చినా వాళ్లకు కాకుండా బినామీ ల తో డబ్బులు పంచుకో మన్టున్నారు. ఇదేమిటి అని అడిగితే నీకు అసలు డబ్బులు రావు అంటున్నారు. సర్ ఒక విషయం, ఏదైనా భూమిని ఎక్కడైనా ఒకరి కంటే ఎక్కువ మందికి పట్టా ఇస్తారా. ఇలా తప్పుడు పట్టాలు యిచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకోకుండా చోట దళారుల ను నమ్మి వాళ్లతో settlement చేసుకోమని వదిలేస్తున్నారు పై అధికారులు. వాళ్లు ఒరిజినల్ పట్టా దారులకు అన్యాయం చేస్తున్నారు. లోకల్గ ఉన్నటువంటి విలేకరులు కూడా దీనిలో పాత్ర పోషించారు. లోకల్ నాయకులు దగ్గర మందు తాగుతూ వాళ్లు తానా అంటే తందాన అంటున్నారు. కొంతమందికి ఐతే మీ భూములు లేనే లేవు అంటున్నారు. మా ఆనుమానం నిజం ఐతే RDO office లో వాళ్లు కూడా కొంత మంది లోకల్ నాయకులతో కుమ్మక్కై జనాలను మోసం చేస్తున్నట్టున్నారు. మీరు నిజాయతీ పరుడు ఐనటువంటి విలేకరిని పంపి విషయమును సేకరించి ఈ అన్యాయాన్ని బయట ప్రపంచానికి తెలియ జేచి మాకు తగు న్యాయం జరిగే టట్లు చేయగలరని ఆశిస్తున్నాము. మాకు ఈ మేలు చేస్తే మీకు మా జీవితాంతం ఋణ పడిన వాళ్ళము అవుతాము.
ఇట్లు
రాచర్ల గ్రామ ప్రజలు
Was this information helpful?
No (0)
Yes (0)
Revenue Workers customer support has been notified about the posted complaint.
Jul 17, 2017
Updated by Trk18 Cheating farmers in sri city area
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment