Comments
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score.
Read more
Read more
7%
Complaints
454
Pending
0
Resolved
31
+91 87 5459 9978
+91 40 2331 8181
+91 87 2827 0434
EENADU Complex,Internet Dept, Somajiguda, Hyderabad, Andhra Pradesh, India - 500082
విజయవాడ: అత్తను గొడ్డలితో నరికి ఆమెను హత్య చేసిన కేసులో అల్లుడు జోజిప్రసాద్‌ను పెనమలూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి డీసీసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీసీపీ గజరావుభూపాల్ మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. నాగాయలంక మండలానికి చెందిన కన్నా జోజిప్రసాద్, శశిరేఖలకు పదేళ్ల కిందట వివాహం జరిగింది. మూడేళ్ల కిందట వీరు వణుకూరు గ్రామంలోని సాయిపురం కాలనీ ఖాళీ ప్లాట్ల వద్ద కాపలా ఉండేందుకు వచ్చారు. భార్యకు పిల్లలు కలగకపోవటంతో వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. జోజిప్రసాద్ తల్లి వీరికి నచ్చచెప్పేవారు. ఈ క్రమంలో జోజిప్రసాద్ తల్లిదండ్రులు ఊరు వెళ్లగా శశిరేఖ తన తల్లి శివలీలను తన వద్ద్ద ఉండేందుకు రమ్మని పిలిచారు. ఈ నెల 24న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. గేదెను అమ్మిన రూ.37వేలు శశిరేఖ వద్ద ఉండటంతో మద్యం తాగేందుకు డబ్బులు ఇమ్మని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. జోజిప్రసాద్ గొడ్డలి తీసుకుని రాగా శశిరేఖ అక్కడి నుంచి పారిపోయింది. తన అత్త శివలీల అడ్డు రావటం వల్లే భార్య తప్పించుకుందన్న కోపంతో జోజిప్రసాద్ గొడ్డలిలో ఆమె ముఖంపై కొట్టడంతో చనిపోయింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు జోజి ప్రసాద్‌ను మంగళవారం అరెస్టు చేశారు. సమావేశంలో సెంట్రల్ ఏసీపీ సత్యానందం, సీఐ దామోదర్ తదితరులున్నారు.