Address: | Vikarabad | Website: | www.tsrtc.com |
వికారాబాద్ అనంతగిరి గుట్ట నంది గాట్ మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడిన వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు..
72 మంది ప్రయాణికులతో వికారాబాద్ నుండి దారుర్ జాతరకు వెళుతున్న బస్సు..
ఒకరు మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు, క్షతగాత్రులను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
బ్రేకులు ఫీల్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగిందంటున్న బస్ కండక్టర్..
ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనలో గాయాలైన వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్... వికారాబాద్ ఆర్టీసీ డిపోలో కాలం చెల్లిన బస్సులు రోడ్డుపై నడుస్తున్నాయి ఎన్ని వార్తలు రాసిన పట్టించుకునే నాధుడే లేడు.. వికారాబాద్ ఆర్టీసీ డిపోలో కాలం చెల్లిన బస్సులే రోడ్డుపై తిరుగుతున్నాయి గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగాయి అయినా కూడా అధికారులకు సోయి లేదు. మన పాలకులు ప్రమాదాలు జరిగినప్పుడు స్పందిస్తారు, తర్వాత అంతే సంగతి... డొక్కు బస్సులను మార్చేస్తే దరిద్రం పోతది.. అవే పెట్టుకొని పాకలాడితే, ఆ దరిద్రం ప్రజల మీద పడతది ఇట్లా అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
Was this information helpful? |
Post your Comment