| Address: D.No.2-387, Ranga Nilayam, MARUTHI NAGAR, KAKINADA, 533005, AP |
నమస్కారం అండి. నేను ఈనెల 22.12.2022 వ తేదీన కాకినాడ నుండి హైదరాబాదు ప్రయాణం చేయడానికి నా మరదలు అయిన కుమారి Kkd swarna rekha, 23 years కి ది 17.12.2022న ఒక టికెట్టు కొనుగోలు చేశాను. ఆ టికెట్ నందు బస్సు 22వ తేదీన కాకినాడ బస్ స్టేషన్ నుండి సాయంత్రం 6:30 కు బయలుదేరుతుందని ముద్రించి ఉన్నది. మేము సదరు 22వ తేదీన సాయంత్రం 5:40 నిమిషాలకు మా ఇంటి దగ్గర నుండి కాకినాడ బస్టాండుకు సాయంత్రం 6:10 నిమిషాల లోపు అనగా 6:30 కి ముందుగానే చేరుకున్నాము. కానీ ఈ లోపు సదరు బస్సు నందు విధులలో ఉన్న మీ సిబ్బంది మా మరదలు (passenger) [protected]కు మూడు పర్యాయములు ఫోన్ చేసి తొందరపెట్టి, వత్తిడికి గురి చేసియున్నారు. కానీ బస్సు బయలుదేరడానికి ఇంకా సుమారు 40 నిముషాల సమయం ఉన్నప్పటికీ, సదరు సిబ్బంది ప్రయాణీకురాలుకి మూడు పర్యాయములు ఫోన్ చేసి తొందర పెట్టి, ఒత్తిడికి గురి చేసినారు. మేము బస్సు బయలు దేరాడానికి ఇంకనూ సుమారు 20 నిమిషాలు సమయం ఉండగా కాకినాడ బస్టాండుకు చేరుకుని, బస్సు ఎక్కించినాను. బస్సు ఎక్కిన వెంటనే సదరు బస్సు బయలుదేరటానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ సుమారు 15 నిముషాల ముందు బయలుదేరినది. సమయం ఉన్నప్పటికీ కూడా ప్రయాణికులను ఒత్తిడికి గురి చేయడం ఎంతవరకు సమంజసం అండి. ఆ సమయంలో మాకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు. ఈ ఆరోపణకి సంబంధించిన తగిన ఆధారాలు (ఫోటోలు వీడియోలు, డేట్ ఉన్న geo లొకేషన్ ఫోటోలు) నా వద్ద ఉన్నవి. అవసరం అయినచో చూపగలవాడను. కనుక ఈ విషయం పై సంజాయషీ ఇవ్వాలి అని కోరుచున్నాను. నా పేరు హనుమంత్. నా సెల్ నెంబర్ [protected]. కాకినాడ.
Telangana State Road Transport Corporation [TSRTC] customer support has been notified about the posted complaint.