| Address: Krishna, Andhra Pradesh, 521201 |
నూజివీడు బస్టాండ్
"పైసా వసూల్..డబ్బు కొట్టు డ్యూటీ పట్టు"
అద్దె బస్సు డ్రైవర్ చేతిలో కీలు బొమ్మగా మారిన RTC ఉద్యోగి TI, సదరు ఉద్యోగి ఆ డ్రైవర్ ని ఏజెంట్ పెట్టి మామూళ్లు వసూలు చేస్తున్న వైనం.
వివరాల్లోకి వెళితే:-
స్థానిక నూజివీడు ఆర్టీసీ సంస్థ లోని ఉద్యోగి TI రామారావు సదరు డిపోలోని ఒక అద్దె బస్సు డ్రైవర్ సతీష్ అనే వ్యక్తి తో కలసి కార్మికులకు వేసే డ్యూటీల విషయం లో అనేక అవకతవకలకు పాల్పడుతూ డ్రైవర్, కండక్టర్ లను అనేక ఇబ్బందులుకు గురి చేస్తున్న వైనం, అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు,
ఇటీవలి కాలంలో RTC సంస్థ లో ఉద్యోగుల కొరత ఉండటంతో ఔట్ సొర్సింగ్ ప్రాతిపదికన ప్రతీ డిపోలో కొంతమంది డ్రైవర్ లను సదరు డిపో మేనేజర్ ద్వార మెడికెల్ చేయించి నియమిచుకోవడం జరిగింది ఔట్ సోర్సింగ్ కార్మికులను పూర్తిగా పక్కకు నెట్టేసి, నిబంధనలను గాలికి వదిలేసి, మామూళ్లు వసూళ్లకు అలవాటు పడి అద్దె బస్సు డ్రైవర్ లకు అనామకులైన బయటి వ్యక్తులకు డ్యూటీ కి ఇంత అని రేట్ ఫిక్స్ చేసి ఇష్టానుసారంగా డబ్బులు తీసుకుని డ్యూటీ లు వేస్తున్న TI, తతంగం అంతా సదరు డ్రైవర్ నడిపిస్తాడు, గత రెండు నెలలుగా ఎవరికి ఏ డ్యూటీ ఎలా వేసాడు అనేది మష్టర్ రిజిస్టర్ చూస్తే అర్థం చేసుకోవచ్చు, ఇతగాడి చరిత్ర చూస్తే గతంలో తిరువూరు డిపొలో వసూల్ రాజా గా దొరికిపోయి ఎన్నో విజిలెన్స్ ఎంక్వైరిలు ఎదుర్కొని బదిలీ పై నూజివీడు డిపో కి వచ్చారు, ఇప్పుడు అతను మళ్లీ తనదైన శైలిలో దందా మొదలు పెట్టారు అని, అసలు ఒక అద్దె బస్సు డ్రైవర్ కి డిపో ఆఫీస్ లో డ్యూటీ చార్ట్ తో పనేంటి అని పలు మంది సంస్థ యొక్క కార్మికులు వాపోతున్నట్లు సమాచారం.
ఈ విషయంలో డిపో మేనేజర్ మరియు పై స్థాయి అధికారులు విజిలెన్స్ స్థాయిలో పరిశీలించి పూర్తి వివరాలు తెలుసుకుని భాద్యులు అయిన వారిపై తగు చర్యలు తీసుకుని ఎవరి డ్యూటీ లు వారికి పద్ధతి ప్రకారం వేసేలా చూడాలని ఆశిద్దాం.
Andhra Pradesh State Road Transport Corporation [APSRTC] customer support has been notified about the posted complaint.
We understand 10 to 15 mins delay, but more than 1hr is really not acceptable.